Rakesh Bedi: సోషల్ మీడియాలో దయచేసి వీడియోలు పెట్టొద్దు
బాలీవుడ్లో తాజా సంచలనంగా నిలిచిన దురంధర్: ది రివెంజ్(durandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. డైరెక్టర్ ఆదిత్యధర్(Adityadhar) రూపొందించిన ఈ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ మార్చి 19న విడుదలై, కేవలం కొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ ఓపెనింగ్స్‌తో ఇది బాలీవుడ్ హిస్టరీలోనే టాప్ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కలెక్షన్లతో పాటు కంటెంట్ పరంగానూ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమాలో రన్వీర్ సింగ్(Ranveer Singh) భారతీయ గూఢచారి హమ్జా/జస్కిరత్ పాత్రలో నటిస్తూ కథను నడిపించాడు. కరాచీ ల్యారి అండర్ వర్ల్డ్లోకి చొరబడే అతని ప్రయాణం చుట్టూ కథ తిరుగుతుంది. యాక్షన్, పొలిటికల్ డ్రామా, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ సమతూకంగా మిళితమై ఉండటం ఈ సినిమాకు ప్రత్యేక బలం. ఇంటర్నేషనల్ స్టైల్ ట్రీట్మెంట్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
ఇదిలా ఉండగా, సినిమాలో కీలక పాత్రలో కనిపించిన రాకేష్ బేడీ(rakesh bedi) సోషల్ మీడియాలో ఓ ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు ముఖ్యమైన సీన్స్ ను రికార్డ్ చేసి షేర్ చేయవద్దని ఆయన అభిమానులను కోరారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లీక్ అవడం వల్ల ఇతరుల థియేటర్ అనుభవం దెబ్బతినడంతో పాటూ వారి థ్రిల్ స్పాయిల్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








