Rakesh Bedi: సినిమాలో సగం కలెక్షన్లు నా వల్లే వస్తాయన్నారు
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన దురంధర్2(Durandhar2) బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్లతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రాకేష్ బేడీ(rakesh bedi) మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. దాదాపు 47 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈసారి జమీల్ జమాల్(jameel jamal) పాత్రలో చూపిన నటనతో కథకు బలమైన మలుపు తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆయన పాత్రకు సంబంధించిన ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసి సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది.
ఇవి కూడా చదవండి
కాగా రాకేష్ బేడీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ చివరి రోజు జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. సెట్స్‌పై అందరూ కలిసి ఉన్న సమయంలో హీరో రణ్వీర్ సింగ్(Ranveer Singh) మైక్ తీసుకుని మాట్లాడిన మాటలు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తే, అందులో సగం తన వల్లేనని రణ్వీర్ చెప్పినట్లు వెల్లడించారు. ఒక నటుడిగా ఇలాంటి ప్రశంస దక్కడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని, అంతకంటే పెద్ద గుర్తింపు అవసరం లేదని ఆయన తెలిపారు.
కామెడీ పాత్రలతో ప్రారంభమైన రాకేష్ బేడీ ప్రయాణం, కాలక్రమేణా గంభీరమైన క్యారెక్టర్ రోల్స్ వైపు మలుపు తిరిగింది. నాలుగు దశాబ్దాలకుపైగా కొనసాగుతున్న ఆయన కెరీర్, ఇప్పటికీ కొత్త తరానికి ప్రేరణగా నిలుస్తోంది. తాజాగా ఎంచుకుంటున్న పాత్రలు కథలో కీలక ప్రాధాన్యతను సంతరించుకోవడం విశేషం. స్టార్ హీరో నుంచి వచ్చిన ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ.. ఈ రెండూ కలిపి ఆయన నటనకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








