Stock Market: ఆవిరైపోతున్న స్టాక్ మార్కెట్లు
ఫిబ్రవరి 28న మొదలైన.. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్(Iran)ల యుద్ధం ఇప్పుడు.. భారత స్టాక్ మార్కెట్ లపై తీవ్రంగా పడుతోంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి మధ్యప్రాచ్య ప్రభావం మన స్టాక్ మార్కెట్ లపై పడి.. ఏకంగా రూ. 31 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరిఅయిపొయింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, విదేశీ నిధుల ప్రవాహాలు, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారత ఆర్ధిక వ్యవస్థపై భయాలతో.. స్టాక్ మార్కెట్ లు భారీగా పడిపోయాయి.
ఇవి కూడా చదవండి
సోమవారం ఒక్క రోజే, మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు రూ.12.78 ట్రిలియన్లు నష్టపోయారు. బిఎస్ఇ(BSE) సెన్సెక్స్ 76,619.25 స్థాయిల నేడు ఉదయం ట్రేడవుతోంది. నిన్నటి సెషన్ లో 78,918.90 ఉండగా.. 2,299.65 పాయింట్లు తగ్గింది. ఎన్ఎస్ఇ(NSE) నిఫ్టీ 50 714.20 పాయింట్లు లేదా 2.92 శాతం తగ్గి 24,450.45 నుండి 23,736.25 వద్ద ట్రేడ్ అవుతుంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి వచ్చిన డేటా ప్రకారం, తాజా యుద్ద పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు.
గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో, విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల నుండి దాదాపు రూ.21,000 కోట్లు విత్ డ్రా చేసేసారు. చమురు ధరలు భారీగా పెరగడంతో స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే బ్యారెల్ చమురు ధర వంద డాలర్లు దాటింది. 29 శాతం అంతర్జాతీయంగా పెరిగాయి. బ్యాంకింగ్ రంగంలో.. ఐసిఐసిఐ(ICICI), హెచ్డీఎఫ్సి(HDFC) బ్యాంక్ లు తీవ్రంగా నష్టపోయాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీలు హెచ్ పీసిఎల్, బీపీసిఎల్ నష్టపోయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. బ్రెంట్ ముడి చమురు వారం రోజుల్లో 25% కి పైగా పెరిగి.. బ్యారెల్ కు 114 డాలర్లు దాటింది.
ఇవి కూడా చదవండి








