PAN: పాన్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు… ఏప్రిల్ 1 నుంచే అమలు
మనమందరమూ నిత్యం ఉపయోగించే శాశ్వత గుర్తింపు సంఖ్య (పాన్ కార్డు) విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేపట్టింది. లావాదేవీ పరిమితులను గణనీయంగా పెంచింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమలులో భాగంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ను నోటిఫై చేసింది. ఇందులో భాగంగా పాన్ కి సంబంధించిన లావాదేవీ పరిమితులను సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.

ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసినా, ఉపసంహరించుకున్నా.. పాన్ వివరాలు ఇకపై ఇవ్వాల్సి వుంటుంది. ఒకటే బ్యాంకు లేదా వేర్వేరు బ్యాంకుల్లో జరిగినా ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుతం ఒక రోజుల్లో 50 వేలు దాటితేనే పాన్ అడుగుతున్నారు. అలాగే ఇళ్లు, స్థలాల కొనుగోలు, అమ్మకం, బహుమతి లేదా ఉమ్మడి డెవలప్ మెంట్ ఒప్పందాల విషయంలో లావాదేవీ విలువ 20 లక్షలు దాటితే ఇకపై పాన్ తప్పనిసరి. ప్రస్తుతం దీని పరిమితి 10 లక్షలుగా వుంది. అలాగే ద్విచక్ర వాహనాలు సహా ఏ వాహనం కొన్నా.. దాని ధర 5 లక్షలుమించితే కొనుగోలుదారుడు పాన్ ఇవ్వాల్సిందే. అయితే పాత నిబంధనల్లో ఇది లేదు. హోటళ్లు లేదా రెస్టారెంట్ల బిల్లులు, కన్వెన్షన్ సెంటర్లకు చేసే చెల్లింపుల్లో లక్ష దాటితే పాన్ సమర్పించాలి ఇప్పటి నుంచి. ప్రస్తుతం 50 వేలు దాటితే పాన్ ఇస్తున్నాం. ఇకపై ప్రతి పాలసీకి పాన్ ఇవ్వాల్సి వుంటుంది. ప్రస్తుతం బీమా పాలసీ కొనుగోలు సమయంలో వార్షిక ప్రీమియం 50 వేలు దాటితేనే పాన్ ఇచ్చేవారం.
ఇవి కూడా చదవండి








