మార్చి 31 తర్వాత పాన్ పని చేయదు
మీ ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేశారా? ఒకవేళ చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. లేకపోతే మార్చి 31 తర్వాతి నుంచి మీ పాన్ పని చేయదని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. పాన్, ఆధార్ అనుసంధానానికి సంబంధించిన గడువును అనేక మార్లు పొడిగించారు. ప్రస్తుత గడువు 2020 మార్చి 31. జనవరి 27 వరకు 30.75 కోట్లకు పైగా పాన్లు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. 2017 జూలై 1 వరకు శాశ్వత ఖాతా నెంబరు (పాన్) కేటాయింపు జరిగిన వ్యక్తులు నిబంధనల మేరకు ఆధారత్ నెంబర్‌తో అనుసంధానం చేయాలని, మార్చి 31 వరకు అనుసంధానం చేయకపోతే పాన్ పని చేయదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. కొన్ని రకాల లావాదేవీలు నిర్వహించినప్పుడు పాన్ నెంబర్‌ను వెల్లడించాల్సి ఉంటుంది. పాన్ పని చేయని పక్షంలో అది లేనట్టే లెక్క. కొన్ని లావాదేవీలప్పుడు పాన్ వివరాలు వెల్లడించని వారిపై ఐటీ చట్టం ప్రకారం తీసుకునే చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని సీబీడీటీ తెలిపింది.













