తక్కువ ధరలో హీరో నుంచి తొలి ‘ఫ్లెక్స్-ఫ్యూయల్’ బైక్స్
మండిపోతున్న పెట్రోల్ ధరలతో బండి బయటకు తీయాలంటేనే సామాన్యులు భయపడుతున్న రోజులివి. ఇలాంటి తరుణంలో ద్విచక్ర వాహన ప్రియులకు ప్రముఖ టూవీలర్ దిగ్గజం ‘హీరో మోటోకార్ప్‘ (Hero MotoCorp) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్ ఖర్చులకు గట్టిగా చెక్ పెట్టేలా, దేశీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి ‘ఫ్లెక్స్-ఫ్యూయల్’ (Flex-Fuel) మోటార్‌సైకిళ్లను (Hero Bike) అధికారికంగా లాంచ్ చేసి సంచలనం సృష్టించింది.
భారతీయుల ఆల్ టైమ్ ఫేవరెట్ బడ్జెట్ బైక్స్ అయిన ‘స్ప్లెండర్ ప్లస్’, ‘హెచ్ఎఫ్ డీలక్స్’ మోడళ్లను ఇప్పుడు ఈ సరికొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చేతుల మీదుగా ఈ బైక్‌లు (Hero Bike) అట్టహాసంగా విడుదలయ్యాయి.
ధర ఎంతంటే..
సామాన్యుల జేబుకు చిల్లు పడకుండా హీరో సంస్థ ఈ బైక్‌ల (Hero Bike) ధరలను చాలా అందుబాటులో ఉంచింది. సరికొత్త ‘హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్’ ప్రారంభ ధరను రూ. 82,710 గా నిర్ణయించారు. మరో బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ ‘హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్’ ధరను కేవలం రూ. 72,792 (ఎక్స్-షోరూమ్)గా ఫిక్స్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఏంటి ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ?
సాధారణంగా బైక్స్ (Hero Bike) కేవలం పెట్రోల్‌తో మాత్రమే నడుస్తాయి. కానీ హీరో తీసుకొచ్చిన ఈ సరికొత్త బైక్‌లు నూటికి నూరు శాతం పెట్రోల్‌తో పాటు.. E20 (20 శాతం ఇథనాల్) నుంచి ఏకంగా E85 (85 శాతం ఇథనాల్) బ్లెండ్ చేసిన ప్రత్యామ్నాయ ఇంధనంతో కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా పరుగులు పెడతాయి.
చెరకు, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారయ్యే ఇథనాల్.. మార్కెట్లో పెట్రోల్ కంటే చాలా చౌకగా లభిస్తుంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇథనాల్ బంకులు అందుబాటులోకి రానుండటంతో, ఈ బైక్స్ (Hero Bike) వాడేవారికి ఇంధన ఖర్చు సగానికి పైగా తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంజిన్ దమ్ము.. ఫీచర్ల జోరు!
ఈ రెండు కొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడళ్లలో (Hero Bike) హీరో తమ అత్యంత నమ్మకమైన 97.2cc (సీసీ) ఇంజిన్‌ను అమర్చింది. ఇథనాల్ ఇంధనం వాడినా ఇంజిన్ పాడవకుండా ఉండేందుకు కారు తరహాలో ఈసీయూ (ECU), ఫ్యూయల్ సిస్టమ్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు. పనితీరుతో పాటు ప్రయాణికుల భద్రత కోసం ఇందులో కళ్లు చెదిరే ఫీచర్లను జోడించారు:
ఐ3ఎస్ టెక్నాలజీ (i3S): సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు ఆటోమెటిక్‌గా ఇంజిన్ ఆఫ్ అయ్యి, మళ్లీ క్లచ్ పట్టుకోగానే ఆన్ అయ్యే ఇంటెలిజెంట్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్. (దీనివల్ల మైలేజ్ భారీగా పెరుగుతుంది)
ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్: సరికొత్త డిజిటల్-అనలాగ్ కాంబినేషన్ మీటర్ కన్సోల్.
సేఫ్టీ సెన్సార్: భద్రతను పెంచే సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్.
టైర్లు: ఎలాంటి రోడ్లపైన అయినా అత్యుత్తమ గ్రిప్ కోసం స్ట్రాంగ్ ట్యూబ్‌లెస్ టైర్లు.








