భారత్ లో రూ.490 కోట్ల పెట్టుబడులు ..అమెరికా సంస్థ ఒప్పందం
అమెరికా విద్యుత్ ద్విచక్రవాహన సంస్థ జీరో మోటర్‌సైకిల్స్‌తో, హీరో మోటోకార్ప్ ఒప్పందం కుదుర్చుకుంది. జీరో విద్యుత్ బైకులను దేశీయంగా హీరో సంస్థ తయారు చేసి, విక్రయించనుంది. జీరో మోటర్‌సైకిల్స్‌కు చెందిన అధిక పనితీరు కలిగిన విద్యుత్ మెషీన్లను దేశీయంగా అసెంబ్లీంగ్ చేయనున్నట్లు హీరో మోటోకార్ప్ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. 2022 సెప్టెంబరులో జీరో మోటార్ సైకిల్స్‌లో 60 మి. డాలర్లు (దాదాపు రూ.490 కోట్ల) పెట్టుబడులు పెడుతున్నట్లు హీరో ప్రకటించింది. అయితే దేశీయ విపణిలోకి జీరో బైకులు ఎప్పుడు వస్తాయో వెల్లడిరచలేదు.






