Bhatti Vikramarka: మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనే లక్ష్యం: భట్టి
2027 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిని ప్రోత్సహించేలా ప్రణాళికలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధికారులకు సూచించారు. బడ్జెట్ (Budget) సన్నాహక సమావేశాల్లో భాగంగా హోంశాఖ, పరిశ్రమలు-ఐటీ శాఖల ప్రతిపాదనలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి(క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమి(ప్యూర్)తో పాటు రూరల్ అగ్రి రీజియన్ ఎకానమి(రేర్)కి కూడా సమ ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. రేర్ (Rare) పరిధిలో పెద్దఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రజా ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. శాంతిభద్రతల అంశంలో ఏ చిన్న పొరపాటుకు హోంశాఖ అధికారులు, సిబ్బంది అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు. పోలీసు (Police) శాఖలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగాన్ని పెంచుతున్నామన్నారు.

ఇవి కూడా చదవండి








