Bhatti Vikramarka: 1960 తర్వాత కాంగ్రెస్ పార్టీకి .. ఇదే తొలిసారి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రంలో రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) 850 సర్పంచ్లను గెలుచుకుని ప్రభంజనం సృష్టించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) చెప్పారు. ఖమ్మం జిల్లా (Khammam district) మధిర అసెంబ్లీ సెగ్మెంట్లోని మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్లకు మధిరలో జరిగిన అభినందన సభలో వారిని భట్టి విక్రమార్క సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మధిర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 1960 తరువాత కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద సంఖ్యలో అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలవటం ఇదే తొలిసారి అన్నారు. 131 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 90 స్థానాలను గెలుపొందిందన్నారు. ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు.






