HRA: హైదరాబాద్ లోని ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
హైదరాబాద్ (Hyderabad) లో ఉద్యోగం చేస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి అద్దెభత్యం (హెచ్ ఆర్ఏ) మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆదాయ పన్ను (Income Tax) నిబంధనలు, 2026ను కేంద్రం నోటిఫై చేసింది. ఆరు దశాబ్దాల పాత ఆదాయపు పన్ను చట్టం -1961 స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి రాబోయే కొత్త నిబంధనలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
గతంలో ముంబయి, కోల్కతా, ఢిల్లీ, చెన్నైలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. ఆయా నగరాల్లో హెచ్ ఆర్ఏ మినహాయింపు పరిమితిని 50 శాతం ఉండేది. తాజాగా ఈ జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ (Ahmedabad) ను కూడా చేర్చారు. అంటే 8 నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ జీతంలో 50 శాతం వరకు హెచ్ ఆర్ఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. మిగిలిన వారికి యథాతధంగా 40 శాతం కొనసాగుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే 2027 జులైలో ఫైల్ చేయబోయే రిటర్నుల సమయంలో ఇది వర్తిస్తుంది. పాత పన్ను విధానంలో పన్నును తగ్గించుకోవడానికి ఈ మార్పు ఉపయోగపడుతుంది. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారు ఈ మినహాయింపు పొందలేరు.
ఇవి కూడా చదవండి








