Revanth Reddy: దక్షిణాసియా టెక్స్టైల్స్ హబ్‌గా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా , ఆర్థికంగా అగ్రగామిగా నిలిపేందుకు పారిశ్రామికవేత్తలు కలిసి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ (HICC)లో నిర్వహించిన ‘ఆసియా టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్’ లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం:
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని రకాల వసతులు, రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారతదేశానికి ఉన్న గొప్ప చరిత్రను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
టెక్స్టైల్స్ రంగంపై ప్రత్యేక దృష్టి:
టెక్స్టైల్స్ అనేది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, వేలాది మంది చేనేత కార్మికుల జీవనాధారమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను ‘దక్షిణాసియా టెక్స్టైల్స్ క్యాపిటల్’ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
హైదరాబాద్ – గ్లోబల్ ఫిల్మ్ డెస్టినేషన్:
హైదరాబాద్ నగరం ఇప్పటికే ప్రపంచ స్థాయి ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్‌గా ఎదిగిందని, చిత్ర పరిశ్రమను మరింత ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. అభివృద్ధి ఎంత ముఖ్యమో, పర్యావరణ పరిరక్షణ కూడా తమ ప్రభుత్వానికి అంతే ప్రాధాన్యత కలిగిన అంశమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.








