Hyd: భారతీయ చేనేత వస్త్రాల సంరక్షణ.. ఉతికేటప్పుడు, ఆ తరువాత పాటించాల్సిన సరైన పద్ధతులు
భారతీయ చేనేత వస్త్రాలు కేవలం బట్టలు మాత్రమే కాదు, అవి మన సంప్రదాయానికి మరియు కళాకారుల నైపుణ్యానికి నిలువుటద్దాలు. మహారాష్ట్రలోని పైథాని, గుజరాత్, రాజస్థాన్ల బాంధని, లక్నో చికంకారి, కేరళ కసావు, కర్ణాటక మైసూర్ సిల్క్, తెలంగాణ పోచంపల్లి ఇక్కత్, అస్సాం ముగా సిల్క్ వంటి ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన నేత శైలి ఉంది. అయితే, ఈ వస్త్రాలు చాలా సున్నితమైనవి కాబట్టి వాటిని మెయింటైన్ చేయడం కష్టమని చాలామంది వీటిని ధరించడానికి వెనుకాడుతుంటారు. మన ప్రియమైన చేనేత వస్త్రాల మన్నికను పెంచడానికి ఇంట్లోనే పాటించాల్సిన కొన్ని సులభమైన, సురక్షితమైన చిట్కాలను గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్‌లోని అప్లయన్సెస్ బిజినెస్ వాషింగ్ మెషీన్స్ హెడ్ మనీష్ శర్మ వివరించారు.
ఉతికే ముందు వస్త్రాలను అర్థం చేసుకోండి
చేనేత వస్త్రాలు రకరకాల నేత పద్ధతులు, రంగులతో తయారవుతాయి. కొన్నింటికి రంగులు వెలిసిపోయే అవకాశం ఉంటుంది, మరికొన్నింటిపై జరీ పని ఉంటుంది. కాబట్టి వాషింగ్ మెషీన్లో వేసే ముందు బట్టపై ఉన్న కేర్ లేబుల్‌ను తప్పక చదవండి.
ఇవి కూడా చదవండి
మెషీన్లో ఎక్కువ బట్టలు వేయకండి
చేనేత వస్త్రాలను ఉతికేటప్పుడు మెషీన్ డ్రమ్ నిండా బట్టలు వేయకూడదు. బట్టలకు తగినంత ఖాళీ ఉన్నప్పుడే అవి ఒకదానికొకటి రాసుకోకుండా, చిక్కుపడకుండా శుభ్రపడతాయి. దీనివల్ల వస్త్రం సహజమైన ఆకృతి దెబ్బతినదు.
సరైన ఉష్ణోగ్రత, మైల్డ్ డిటర్జెంట్ వాడండి
వేడి నీరు సహజ దారాలను బలహీనపరుస్తుంది, బట్టలు కుంచించుకుపోయేలా చేస్తుంది. ఎప్పుడూ 20-25°C మధ్య ఉండే సాధారణ నీటిని మాత్రమే వాడండి. అలాగే ఘాటైన డిటర్జెంట్లు లేదా బ్లీచ్ వాడకుండా సున్నితమైన (Mild) డిటర్జెంట్‌ను ఎంచుకోండి.
జెంటిల్-వాష్ (Gentle Wash) ఫీచర్‌ను ఎంచుకోండి
మీ మెషీన్లో జెంటిల్ వాష్ మోడ్‌ను మాత్రమే ఉపయోగించండి. దీనివల్ల బట్టలపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వీలైతే చేనేత వస్త్రాల కోసం ప్రత్యేకంగా పరీక్షించిన, డిజైన్ చేయబడిన గోద్రెజ్ వాషింగ్ మెషీన్ వంటి అత్యాధునిక టెక్నాలజీ ఉన్న మెషీన్లను వాడటం ఉత్తమం.
ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బట్టలను గట్టిగా పిండకూడదు. అలా చేయడం వల్ల దారాలు సాగిపోయి బట్ట ఆకారం మారుతుంది. తక్కువ RPM వేగంతో తిరిగే ఫ్రంట్-లోడ్ మెషీన్లలో సున్నితమైన స్పిన్ సైకిల్ వాడటం శ్రేయస్కరం. బట్టలు ఉతికిన తర్వాత నేరుగా ఎండలో కాకుండా, నీడలో మరియు గాలి తగిలే చోట ఆరబెట్టాలి. దీనివల్ల రంగులు వెలిసిపోకుండా ఉంటాయి.
ఇవి కూడా చదవండి








