Telangana: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడకుంటే 10 వేలు కట్ : కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా విద్వేష పూరిత ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లు, తెలంగాణ ప్లాట్ ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లు, తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఎల్ అండ్ టీ నుంచి మెట్రో స్వాధీన ప్రక్రియ వేగవంతం చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది.
అలాగే కులగణనపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నిపుణుల కమిటీ నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. అలాగే రోహిత్ వేముల చట్టం విధి విధానాల కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ తీర్మానం చేసింది. ఈ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ఉత్తమ్, పొన్నం వుంటారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, మత సామరస్యాన్ని కాపాడటానికి, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి ‘‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026’’ ఉపయోగకరిస్తుంది. విద్వేషపూరిత ప్రసంగాలు, అల్లర్లను ప్రేరేపించే వ్యాఖ్యలను కట్టడి చేసేందుకు ఇది శక్తిమంతమైన ఆయుధం.
అలాగే మానవీయ కోణంలో ప్రభుత్వం ఓ వినూత్న బిల్లు కూడా తీసుకొచ్చింది. వృద్ధాప్యంలో వున్న తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనం నుంచి 15 శాతం లేదా 10 వేలు కట్ చేసి, నేరుగా తల్లిదండ్రులకు అందజేస్తారు. అలాగే న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య వంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడటమే లక్ష్యం.
ఇవి కూడా చదవండి








