Kavuru : అలాంటి నేతను కోల్పోవడం తీరని లోటు : సీఎం చంద్రబాబు
కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు (Kavuru Sambasiva Rao) నీతి, నిజాయతీతో రాజకీయాలు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కొనియాడారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన నాయకుడని గుర్తు చేశారు. అలాంటి నేతను కోల్పోవడం తీరని లోటని అన్నారు. హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్ లోని కావూరు నివాసంలో ఆయన కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు పరామర్శించారు. కావూరు చిత్రపటానికి నివాళులర్పించారు. చంద్రబాబుతోపాటు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) కూడా సాంబశివరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








