Kavuru Sambasiva Rao: కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు ఇక లేరు
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (Kavuru Sambasiva Rao) (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కావూరి సాంబశివరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కావూరి మరణం రాజకీయ రంగానికి తీరని లోటుగా పలువురు నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు (Chandrababu,), కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh), పలువురు నేతలు కావూరి సాంబశివరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి







