Retirement Age: ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. పదవీ విరమణ వయసు పొడిగింపు!
AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), కార్పొరేషన్లు , గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. వీరి పదవీ విరమణ వయసును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.
కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు: ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేష్, , నారాయణలతో కూడిన ఉపసంఘం ఇప్పటికే సమావేశమైంది. వయసు పెంపు వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం, తదితర అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
8500 మందికి లబ్ధి: ఈ నిర్ణయం అమలులోకి వస్తే 9, 10 షెడ్యూల్ సంస్థల్లోని సుమారు 8,500 మంది రెగ్యులర్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. గత ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఇవి కూడా చదవండి
అధికారిక ప్రకటన బాకీ: దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి.
జాబ్ క్యాలెండర్‌పై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల అసంతృప్తి:
ప్రభుత్వం ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (EU) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఖాళీల భర్తీకి డిమాండ్: ఆర్టీసీలో ఉన్న సుమారు 10 వేల ఖాళీల ప్రస్తావన జాబ్ క్యాలెండర్లో లేకపోవడంపై యూనియన్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తదుపరి కార్యాచరణ: ఈ డిమాండ్ల సాధనకై ఈ నెల 22న ఒంగోలులో రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటామని యూనియన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








