‘‘నేనేమైనా క్రిమినల్ నా? ఉగ్రవాదినా?’’ బెయిల్ దొరక్క పోవడతో పవన్ ఖేరా తీవ్ర వ్యాఖ్యలు
కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. గౌహతిలో నమోదైన కేసులో ఈ నెల 20 వరకూ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోరుతూ చేసిన అభ్యర్థనను (ట్రాన్సిట్ ముందస్తు బెయిల్) సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ముందస్తు బెయిల్ కోసం అసోంలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించింది.
జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం పవన్ ఖేరా అభ్యర్థనను తిరస్కరించింది. అయితే పవన్ ఖేరా పక్షాన సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ తన వాదనలు వినిపించారు. పవన్ ఖేరా ఏమైనా ఉగ్రవాదా? అంటూ ప్రశ్నించారు. అయినా సరే ఆయన వాదనలు కోర్టులో నెగ్గలేదు. ట్రాన్సిట్ బెయిల్ కోసం అసోం హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఇవి కూడా చదవండి
అయితే అసోంలో న్యాయస్థానాలకు సెలవులు వున్నాయని, తన ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ పై స్టే ఎత్తేయాలని, ఆ స్టే ను మంగళవారం దాకా పొడిగించాలని ఖేరా సుప్రీం కోర్టును కోరుతూ మరో పిటిషన్ వేశారు. దీనినే సుప్రీం తోసిపుచ్చింది. అయితే.. ఈమాత్రం ఉపశమనం ఇవ్వకపోవడానికి నేనేమైనా క్రిమినల్ నా? ఉగ్రవాదినా? అని ఆయన తరపు న్యాయవాది వాదించారు. అయితే.. ఈ వ్యవహారంలో తామేమీ చేయలేమని, అసోం కోర్టుకు పూర్తి స్వేచ్ఛ వుంటుందని, తమ గత ఆదేశాలు ప్రభావితం చేయబోవని, అందుకే ఆలస్యం చేయకుండా పిటిషన్ వేసుకోవాలని, అవసరమైతే అత్యవసర పిటిషన్ కి వెళ్లాలని సుప్రీం కోర్టు సూచించింది.
అసోం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ భార్య రింకీ భుయాన్ శర్మపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు దుమ్ము దుమారం రేపాయి. సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్ పోర్టులు, పౌరసత్వాలు వున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఆమె పరువు నష్టం దావా కేసు వేశారు. తనపై ఆరోపణల క్రమంతో తప్పుడు పత్రాలను సృష్టించి, ఫోర్జరీకి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పవన్ ఖేరాపై గౌహతిలో కేసు నమోదైంది.
ఇవి కూడా చదవండి








