సమ్మర్ టార్గెట్ గా రౌడీ జనార్ధన?
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు రణబాలి(Ranabaali), మరోవైపు రవి కిరణ్ కోలా(Ravikiran kola) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్ధన(Rowdy janardhana) షూటింగ్‌లను సమాంతరంగా ప్లాన్ చేస్తున్నారు. రష్మిక(Rashmika) గాయపడటంతో రణబాలి షూటింగ్ కు కొంత గ్యాప్ వచ్చినప్పటికీ, ప్రస్తుతం పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాను అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.
అయితే రౌడీ జనార్ధన విషయంలో మాత్రం రిలీజ్ వ్యూహం మారినట్లు తెలుస్తోంది. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేయాలని భావించిన నిర్మాతలు, ఇప్పుడు సమ్మర్ 2027ను టార్గెట్ గా పెట్టుకున్నారని సమాచారం. రణబాలి షూటింగ్ పూర్తైన వెంటనే విజయ్ దేవరకొండ పూర్తిస్థాయిలో ఈ గ్రామీణ మాస్ ఎంటర్టైనర్పై దృష్టి పెట్టనున్నారని టాక్.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గోదావరి ప్రాంత యాసలో మాట్లాడనున్నారన్న అంశం ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది. కీర్తి సురేష్(Keerthy suresh) హీరోయిన్ గా నటిస్తుండగా, దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్నారు. విజయ్ను కొత్త మాస్ అవతార్‌లో చూపించేందుకు డైరెక్టర్ రవి కిరణ్ కోలా సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో సమ్మర్ 2027లో రౌడీ జనార్ధన ఎలాంటి సందడి చేస్తుందన్న ఆసక్తి అప్పుడే మొదలైంది.








