గీతా ఆర్ట్స్ మళ్లీ ఫుల్ బిజీ.. రెండేళ్లకు భారీ ప్రాజెక్టుల లైనప్!
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన అల్లు అరవింద్(Allu aravind)కు చెందిన గీతా ఆర్ట్స్(Geetha arts) కొంతకాలంగా కొత్త ప్రాజెక్టుల విషయంలో సైలెంట్ గా వ్యవహరిస్తూ కనిపించింది. తండేల్(thandel), ది గర్ల్‌ఫ్రెండ్(the girlfriend) తర్వాత సంస్థ నుంచి పెద్దగా కొత్త సినిమాల అనౌన్స్మెంట్స్ రాకపోయినా, ఇప్పుడు రానున్న రెండేళ్ల కోసం భారీ ప్రణాళికలతో సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా అల్లు అర్జున్(Allu arjun) హీరోగా మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్(Basil Joseph) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుందని తెలుస్తోంది.
అటు నాగచైతన్య(Naga chaitanya) తర్వాతి సినిమాను డైరెక్టర్ క్లాక్స్(Clarks) తెరకెక్కించనుండగా, ఈ సినిమాకు గీతా ఆర్ట్స్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుంది. దసరా తర్వాత షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఎన్నో ఏళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న ప్రముఖ సింగర్ ఎం.ఎస్. సుబ్బులక్ష్మి(MS Subbalakshmi) బయోపిక్ కూడా ఎట్టకేలకు ఖరారైనట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించనున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకు గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వం వహించే అవకాశం ఉంది.
ఇవే కాకుండా అఖిల్ అక్కినేని(Akhil akkineni)తో మరో సినిమా కూడా డిస్కషన్స్ దశలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు చిన్న, మధ్యస్థాయి బడ్జెట్ సినిమాల కోసం ఉన్న GA2 పిక్చర్స్(GA2 Pictures) మూడు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను రెడీ చేస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్(Dulquer salman) నటిస్తున్న ఆకాశంలో ఒక తార(Aakasam lo oka tara) షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్(Swapna Cinemas) నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి రాబోయే రెండేళ్లు గీతా ఆర్ట్స్‌కు అత్యంత బిజీగా మారనున్నాయి.








