కమల్ హాసన్ మరోసారి షాక్ ఇవ్వబోతున్నారా? కొత్త పోస్టర్లో భారీ హింట్!
యూనివర్సల్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న టైమ్ లో మరో క్రేజీ మూవీని అనౌన్స్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ ఎస్‌యూ అరుణ్ కుమార్(SU Arun Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్(Raj Kamal Films International) బ్యానర్‌పై కమల్ హాసన్‌తో పాటు ఆర్. మహేంద్రన్(R. Mahendran) నిర్మించనున్నారు. సేతుపతి(Sethupathi) మూవీతో డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ కుమార్, ఇటీవల చిత్తా(Chittha) తో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ ను కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆయన కమల్ హాసన్ కోసం రెడీ చేసిన విభిన్నమైన కథపై ఆసక్తి పెరుగుతోంది.
ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఇందులో కమల్ హాసన్ పూర్తిగా స్టైలిష్, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. దట్టమైన గడ్డం, వెనక్కి సర్దిన హెయిర్‌స్టైల్, బ్లాక్ షర్ట్‌తో పాటు ఆలివ్ గ్రీన్ ట్రౌజర్స్‌లో ఆయన కనిపించిన తీరు పోస్టర్‌కు రా అండ్ పవర్ఫుల్ ఫీల్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా చేతిలో భారీగా వంగిన కత్తిని పట్టుకుని ముందుకు నడుస్తున్న కమల్ లుక్ సినిమాపై ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
ప్రశాంతంగా కనిపిస్తున్న ఆయన బాడీ లాంగ్వేజ్‌కు, చేతిలో ఉన్న భయానక ఆయుధానికి మధ్య కనిపిస్తున్న వ్యత్యాసమే పోస్టర్లో మెయిన్ హైలైట్‌గా మారింది. కంట్రోల్ లో ఉన్నట్లు కనిపించే పాత్ర వెనుక ఎంతటి డెప్త్ దాగి ఉందనే ఆసక్తిని కమల్ హాసన్ ఎక్స్ప్రెషన్ కలిగిస్తోంది. విభిన్న కథలను తెరపైకి తీసుకురావడంలో పేరున్న ఎస్‌యూ అరుణ్ కుమార్, అసాధారణ పాత్రలకు ప్రాణం పోసే కమల్ హాసన్ కలయికతో ఈ సినిమా కోలీవుడ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.








