టాక్సిక్ తర్వాత కూడా తగ్గని నమ్మకం.. రామాయణ కోసం యష్ కొత్త వ్యూహం!
కేజీఎఫ్(KGF)తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్(Yash)కు ఇటీవల టాక్సిక్(Toxic) భారీ నిరాశను మిగిల్చినప్పటికీ, నిర్మాతగా ఆయన ప్రయాణం మాత్రం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆ సినిమాపై ఎంతో నమ్మకంతో కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన యష్, ఇప్పుడు తన తర్వాతి ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తైన టాక్సిక్ తర్వాత ఫ్యామిలీతో కలిసి విదేశీ విహారయాత్రకు వెళ్లిన యష్, తిరిగి వచ్చిన వెంటనే రామాయణ రిలీజ్ ప్లాన్ పై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ ఎపిక్‌లో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఆసక్తికరంగా, ఈ సినిమాకు నటుడిగానే కాకుండా కో ప్రొడ్యూసర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. సినిమా కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా, సౌత్ థియేట్రికల్ రైట్స్ లో మెయిన్ షేర్ ను యష్ దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో రామాయణ సక్సెస్ యష్ కు నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఎంతో కీలకంగా మారనుంది.
ఇప్పటికే సౌత్ మార్కెట్లో సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి యష్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, ఇండస్ట్రీలోని కీలక వ్యక్తులతో డిస్కషన్స్ జరుపుతున్నట్లు టాక్. అయితే ఇప్పటివరకు ఎలాంటి డీల్స్ ఫిక్స్ కాలేదు. రణబీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సన్నీ డియోల్(Sunny Deol) హనుమంతుడిగా కనిపించనున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా(Namith Malhotra) నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి తొలి భాగాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.








