వరుస హిట్లు.. భారీ హీరోలతో సినిమాలు.. మమితా కెరీర్ టాప్ గేర్‌లో!
మమితా బైజు(Mamitha Baiju) కెరీర్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల్లో వేగంగా దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ల జర్నీకి మంచి ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. ప్రేమలు(Premalu) సినిమాతో విస్తృత గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత వచ్చిన ఛాన్సులను చక్కగా ఉపయోగించుకుంటూ తన మార్కెట్‌ను విస్తరించుకుంటోంది. డ్యూడ్(Dude), జన నాయగన్(Jana nayagan), కారా(kaara), విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath and sons), బెత్లెహెం కుటుంబ యూనిట్(Bethlehem family unit) వంటి సినిమాలతో వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా 2026లో ఆమె నటించిన సినిమాల ఫలితాలు మమితా కెరీర్‌కు మరింత బలాన్ని ఇచ్చాయి.
విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో సూర్య(Suriya)తో కలిసి నటించిన మమితా, భారీ స్థాయి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా ఇండియాలో రూ.100 కోట్ల మార్క్‌ను దాటడం ఆమె కెరీర్లో కీలక మైలురాయిగా చెప్పొచ్చు. మరోవైపు బెత్లెహెం కుటుంబ యూనిట్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. విజయ్(Vijay), సూర్య వంటి అగ్ర నటులతో చాలా తక్కువ టైమ్ లోనే కలిసి నటించే అవకాశం రావడం మమితాపై ఇండస్ట్రీలో పెరుగుతున్న నమ్మకాన్ని చూపిస్తోంది.
ఇక ఆమె చేతిలో ఉన్న ఇరండు వానం(Irandu Vanam), ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేమలు2(Premalu2) వంటి సినిమాలు మమిత కెరీర్‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే అవకాశముంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న మమితా బైజు కేవలం బ్రేక్అవుట్ స్టార్‌గా కాకుండా సౌత్ సినిమాకు కొత్త తరం స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్నట్లు కనిపిస్తోంది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఆమె అందుకుంటున్న భారీ అవకాశాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.








