రియల్ లైఫ్ మ్యాజిక్‌తో రాకా.. దీపిక పాత్రకు మరింత సహజత్వం!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో అట్లీ(Atlee) దర్శకత్వంలోని రాకా(raaka) ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమా గురించి ఇప్పటికే భారీ స్థాయిలో డిస్కషన్ జరుగుతుండగా, ఇప్పుడు దీపిక పాత్రకు సంబంధించిన ఆసక్తికర అంశం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కథలో భాగంగా ఆమె కొన్ని కీలక సీన్స్ లో ప్రెగ్నెంట్ గా కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ సీన్స్ విషయంలో మేకర్స్ కు ఊహించని విధంగా రియల్ లైఫ్ పరిస్థితులే కలిసి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో రెండోసారి మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు రెడీ అవుతున్న దీపిక, అదే సమయంలో రాకా లో కూడా ప్రెగ్నెంట్ పాత్రకు సంబంధించిన సీన్స్ లో కనిపించాల్సి రావడం విశేషం. సాధారణంగా ఇలాంటి సీన్స్ కోసం స్పెషల్ మేకప్ లేదా ప్రోస్తెటిక్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. కానీ ఈసారి స్క్రీన్‌పై పాత్రకు అవసరమైన సహజత్వం నిజ జీవిత పరిస్థితుల ద్వారానే రావడంతో, ఆ సీన్స్ మరింత నేచురల్‌గా కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
డాక్టర్ల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటూనే, సినిమా షూటింగ్‌కు అవసరమైన కొన్ని ముఖ్యమైన సీన్స్ లో దీపిక పాల్గొన్నట్లు సమాచారం. అట్లీ తన స్పెషల్ విజువల్ ట్రీట్మెంట్తో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో దీపిక పాత్ర కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. రీల్ లైఫ్ పాత్రకు రియల్ లైఫ్ పరిస్థితి తోడవడంతో రాకాలో ఆమె కనిపించే సీన్స్ పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది.








