సింపుల్ లుక్ లో ఎట్రాక్ట్ చేస్తున్న అందాల రాశి
ఊహలు గుసగుసలాడే(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రాశీ ఖన్నా(Raashi Khanna), మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకుని ఎంతోమంది కుర్రాళ్ల మనసుల్ని దోచేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాశీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. అందులో భాగంగానే రాశీ తాజాగా షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో రాశీ చాలా సింపుల్ లుక్ లో, మినిమల్ మేకప్ లో కనిపించి నెటిజన్లను ఆకట్టుకుంటుంది.








