The paradise: మోహన్ బాబు చేసేది విలన్ పాత్ర కాదా?
నేచురల్ స్టార్ నాని(nani) వరుస సక్సెస్లతో ఫుల్ జోష్ మీదున్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతీ సినిమా హిట్టవడంతో నాని మార్కెట్ విపరీతంగా పెరిగింది. దసరా(Dasara), హిట్3(hit3) తర్వాత నానికి మాస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్(The paradise) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
దానికి కారణం ఆల్రెడీ నాని(nani)- శ్రీకాంత్ కలయికలో వచ్చిన దసరా సినిమా మంచి సక్సెస్ అవడంతో పాటూ, ది ప్యారడైజ్ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ తెగ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu) ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మోహన్ బాబు ఈ మూవీలో నటిస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఆయన ఇందులో విలన్ గా కనిపించనున్నా డని అందరూ భావిస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మోహన్ బాబు చేసేది విలన్ రోల్ కాదని, నానికి పెంపుడు తండ్రి పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారని అంటున్నారు. మరి మోహన్ బాబు- నాని మధ్య ఎలాంటి ఎమోషనల్ సీన్స్ ఉంటాయో చూడాలి.





