Virosh: విరోష్ జంట ఖాతాలో మరో రికార్డు
టాలీవుడ్ యంగ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ(vijay devarakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే వారి పెళ్లి వార్త కేవలం సినీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీ చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రమ్ లో ఈ జంట పెళ్లి ఫోటోలు, కొలాబరేషన్ పోస్టులు అద్భుతమైన స్పందనను అందుకుని రికార్డులను సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ఈ జంట చేసిన వారి పెళ్లి పోస్ట్ ఇప్పటికే 27 మిలియన్‌కు పైగా లైక్స్ సాధించి ప్రపంచవ్యాప్తంగా భారీ రికార్డు నెలకొల్పింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట మరో అంతర్జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో(Christiano ronaldo), లియనెల్ మెస్సీ(Lionel messi) కలిసి 2022లో ప్రముఖ లగ్జరీ బ్రాండ్ లూయీస్ విట్టన్(Louis Vitton) తో చేసిన కొలాబరేషన్ పోస్ట్ అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ పోస్టుకు ఇన్‌స్టాగ్రమ్‌లో సుమారు 8.1 మిలియన్ లైక్స్ రావడంతో సెలబ్రిటీ- బ్రాండ్ కలయికలో అత్యధిక రెస్పాన్స్ పొందిన పోస్టుగా నిలిచింది.
అయితే ఇప్పుడదే రికార్డును విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా జంట బ్రేక్ చేసింది. ప్రముఖ దుస్తుల బ్రాండ్ మాన్యవర్(Manyavar) తో చేసిన వారి పెళ్లి కొలాబరేషన్ పోస్ట్ ఇప్పటికే 10 మిలియన్‌కు పైగా లైక్స్ ను అందుకుంది. దీంతో సెలబ్రిటీ- బ్రాండ్ కొలాబరేషన్ పోస్టుల విభాగంలో ప్రపంచస్థాయిలో ఉన్న రికార్డును ఈ యువ జంట అధిగమించినట్లు చెప్పాలి. వారి పెళ్లి ప్రభావం సోషల్ మీడియాలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ఈ రికార్డులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
https://www.instagram.com/reel/DVVqF26E566/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==








