కేంద్రం గుడ్ న్యూస్, పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్ లేదు..!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయంటూ సాగుతున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయని, లీటరుకు ఏకంగా రూ. 25 నుండి రూ. 28 వరకు పెరిగే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో, కొన్ని వెబ్ పోర్టల్స్‌లో వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. గత కొద్ది రోజులుగా ఇంధన ధరల పెంపుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు(Crude Oil) ధరల ప్రభావం మరియు దేశీయ ఎన్నికల సమీకరణాల నేపథ్యంలో ధరలు భారీగా పెరుగుతాయని ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే, ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం ‘ఎక్స్’ వేదికగా అధికారిక వివరణ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 25-28 మేర పెరగొచ్చంటూ వస్తున్న కథనాలు కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టం చేసింది. ఇవి పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవి అని పేర్కొంది.
ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు అని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని కోరింది. సాధారణంగా ఎన్నికల సమయంలో ధరలు స్థిరంగా ఉంచి, ఫలితాల తర్వాత పెంచుతారనే అపవాదు ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ఈసారి కేంద్రం ముందుగానే స్పందించి, పెంపు ప్రతిపాదన లేదని చెప్పడం సామాన్యులకు పెద్ద ఊరటనిచ్చే విషయమే. చమురు కంపెనీలు కూడా ప్రస్తుతానికి ధరల సవరణపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి








