Petrol: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, సామాన్యులకు కేంద్రం బంపర్ ఆఫర్..!
దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే దిశగా కేంద్రం కీలక అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనలతో కంగారు పడుతోన్న.. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల అస్థిరత ఉన్నప్పటికీ, సామాన్యులపై భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) భారీగా తగ్గిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం, కేంద్రం పెట్రోల్ మరియు డీజిల్ రెండింటిపైనా ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించింది.
పెట్రోల్‌పై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 13 నుండి రూ. 3కి తగ్గించారు. డీజిల్‌పై గతంలో ఉన్న రూ. 10 సుంకాన్ని పూర్తిగా ఎత్తేసింది కేంద్రం. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉన్న తరుణంలో, కేంద్రం ఈ ఉపశమన చర్యలు చేపట్టడం గమనార్హం. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (IOCL, HPCL, BPCL) తమ పాత ధరలనే కొనసాగిస్తుండగా, తాజా ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల వినియోగదారులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గత కొద్ది రోజులుగా నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిటైలర్లు పెట్రోల్ ధరలను రూ. 5.30 వరకు పెంచడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రజలపై ద్రవ్యోల్బణ ప్రభావం పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తగ్గించడం వల్ల రవాణా రంగంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. లారీలు, వ్యాన్ల ద్వారా సరఫరా అయ్యే కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక రకంగా బంపర్ ఆఫర్ అంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి








