Maruti Suzuki: కారు సర్వీసింగ్‌కు నో టెన్షన్.. మారుతీ సుజుకీ ‘క్విక్‌స్టాప్’ సెంటర్లు!
ఉరుకులు పరుగుల నగర జీవితంలో కారును సర్వీసింగ్ (Car Servicing) సెంటర్‌కు తీసుకెళ్లి, రోజంతా వెయిట్ చేసి, మళ్లీ సాయంత్రం దాన్ని తీసుకురావడం అంటే సామాన్యుడికి పెద్ద ప్రహసనమే. పని ఒత్తిడిలో పడి చాలామంది తమ వాహనాల సర్వీసింగ్‌ను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఒకవేళ ఆ సర్వీస్ సెంటరే నేరుగా మీ ఆఫీస్ కిందకు వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ వినూత్న ఆలోచనతోనే దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ (Maruti Suzuki) కస్టమర్ల ముందుకు వచ్చింది.
ఏమిటీ ‘క్విక్‌స్టాప్’ కాన్సెప్ట్?
మారుతీ సుజుకీ (Maruti Suzuki) అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘క్విక్‌స్టాప్’ (QuickStop) పేరిట సరికొత్త తరహా కంటైనర్ సర్వీస్ సెంటర్లకు రూపకల్పన చేసింది. ఈ కాన్సెప్ట్‌లో భాగంగా భారీ కంటైనర్లను (Shipping Containers) చిన్నపాటి, అత్యాధునిక కార్ సర్వీస్ సెంటర్లుగా మార్చేస్తారు. వీటిని ఏర్పాటు చేయడానికి పెద్దగా స్థలం అవసరం లేదు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వీటిని ఎక్కడైనా ఇన్స్టాల్ చేయొచ్చు. నిత్యం వాహన రద్దీ ఎక్కువగా ఉండే ఐటీ పార్కులు, ఆఫీస్ క్యాంపస్‌లు (Office Campuses), ఎయిర్పోర్ట్ జోన్లు, ఫ్లీట్ హబ్‌ల వద్ద వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
ఆఫీస్‌కు వెళ్తూ కారు ఇచ్చేయొచ్చు
ఉద్యోగులు ఉదయం తమ ఆఫీసుకు వెళ్లేటప్పుడు కింద ఉన్న ‘క్విక్‌స్టాప్’ వద్ద తమ కారును వదిలేసి, సాయంత్రం డ్యూటీ ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు సర్వీసింగ్ పూర్తయిన కారును పికప్ చేసుకోవచ్చు. ఈ (Maruti Suzuki) కేంద్రాల్లో సాధారణ మెయింటెనెన్స్ (Regular Maintenance), చిన్నపాటి మరమ్మతులు (Minor Repairs) వేగంగా చేస్తారు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీరు అవసరం లేని (Water-less) కార్ వాషింగ్, అలాగే కేవలం బ్యాటరీతో పనిచేసే ఆధునిక పరికరాలను మాత్రమే ఈ ‘క్విక్‌స్టాప్’లలో వినియోగిస్తారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్ సహా 6 నగరాల్లో..
మారుతీ సుజుకీ (Maruti Suzuki) కస్టమర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఈ ‘క్విక్‌స్టాప్’ ఆలోచనతో ముందుకొచ్చినట్లు సంస్థ ఎండీ & సీఈవో హిసాషీ టకేయుచి (Hisashi Takeuchi) వెల్లడించారు. “కస్టమర్ల వద్దకే నేరుగా సర్వీస్‌ను తీసుకెళ్లాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఐటీ కారిడార్లు, కార్పొరేట్ సంస్థలు లేదా ఫ్లీట్ ఆపరేటర్లు తమ ప్రాంగణంలో కాస్త స్థలం కేటాయిస్తే.. అక్కడే మా మారుతీ డీలర్లు ఈ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు” అని ఆయన వివరించారు. తొలి దశలో (Pilot Project) భాగంగా ఈ ‘క్విక్‌స్టాప్’ కేంద్రాలను హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, సూరత్ నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు. వినియోగదారుల నుంచి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని నగరాలకు వీటిని విస్తరించాలని మారుతీ సుజుకీ (Maruti Suzuki) ప్రణాళికలు రచిస్తోంది.
ఇవి కూడా చదవండి








