Flight Ticket: ఫ్లైట్ టికెట్ రిఫండ్ పై గుడ్ న్యూస్..!
ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తమ సేవలను సులభతరం చేస్తూ వస్తున్న పౌర విమానయాన శాఖ.. కీలక అడుగులు వేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత విమానయాన నియంత్రణ సంస్థ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), విమాన టికెట్ల రద్దు, మార్పులను సులభతరం చేయడానికి విమాన టికెట్ల వాపసు నిబంధనలను అప్డేట్ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ప్రయాణీకులు బుకింగ్(Flight Ticket) చేసిన 48 గంటల్లోపు అదనపు ఛార్జీలు లేకుండా విమాన టిక్కెట్లను రద్దు చేయడం గాని అప్డేట్ చేయడం గాని చేయవచ్చు.
విమానయాన సంస్థలు 14 వర్కింగ్ డేస్ లోపు వాపసు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. బుకింగ్ చేసిన 24 గంటలలోపు గుర్తిస్తే మాత్రం.. పేరులో తప్పులు ఎడిట్ చేయడానికి ఏ చార్జీలు విధించకూడదు. ఈ మార్పులు, ముఖ్యంగా గత డిసెంబర్లో ఇండిగో విమానాల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడిన నేపధ్యంలో.. దీనిపై విమానయాన శాఖ మార్పులు చేసింది. అయితే దీనికి కొన్ని కండీషన్స్ ఉన్నాయి. విమానయాన సంస్థలతో నేరుగా చేసిన బుకింగ్‌లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
![]()
ట్రావెల్ ఏజెంట్లు(Travel agent) లేదా థర్డ్-పార్టీ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్ల విషయంలో విమానయాన సంస్థలు రిఫండ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కారణంగా జరిగే టికెట్ క్యాన్సిల్ కు సంబంధించి కూడా మార్పు చేసారు. ఆరోగ్య సమస్యలు కారణంగా తమ ప్లానింగ్ లో మార్పులు జరిగితే.. వారికి ఏ ఇబ్బందులు లేకుండా చూడనున్నారు. టిక్కెట్లు ముందుగా లేదా ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న సమయంలో కొత్త నిబంధనల ప్రకారం, ట్రావెల్ ఏజెంట్ కాకుండా, ఎయిర్‌లైన్ సంస్థ రీఫండ్ బాధ్యతను తీసుకుంటుంది. రీఫండ్లు సకాలంలో అందకపోవడంపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి







