Budget 2026: ఈ ధరలు తగ్గుతాయి.. ఇవి పెరుగుతాయి
Budget 2026: వరుసగా 9వ సారి బడ్జెట్‌ను సమర్పించిన నిర్మలా సీతారామన్, సుంకాల సవరణ ద్వారా పలు రంగాలకు ఊరటనిచ్చారు. ముఖ్యంగా విదేశీ విద్య, ఆరోగ్యం, పర్యావరణ రంగాలకు సంబంధించిన వస్తువుల ధరలు తగ్గగా, నిబంధనల ఉల్లంఘన, ట్రేడింగ్‌పై భారాలు పెరిగాయి.
ధరలు తగ్గనున్నవి (చౌక):
- విదేశీ ప్రయాణాలు: విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS (టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) 5-20% నుండి 2% కి భారీగా తగ్గింది.
- విదేశీ విద్య: విదేశాలలో చదువుకునే విద్యార్థుల ఖర్చులపై TDS తగ్గించారు.
- ఆరోగ్యం: క్యాన్సర్, అరుదైన వ్యాధుల నివారణకు వాడే మందులపై దిగుమతి సుంకం రద్దు చేశారు.
- ఎలక్ట్రానిక్స్: మైక్రోవేవ్ ఓవెన్లు, వ్యక్తిగత అవసరాల కోసం విదేశాల నుండి తెచ్చుకునే వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
- పర్యావరణం: సోలార్ ప్యానెల్ తయారీకి వాడే సోలార్ గ్లాస్, కీలక ఖనిజాల వెలికితీతకు వాడే యంత్రాలపై పన్నులు తగ్గించారు.
- తయారీ రంగం: విమానాల విడిభాగాలు, బూట్ల తయారీకి వాడే పైభాగం (Shoe upper) ఎగుమతులపై రాయితీలు ఇచ్చారు.
- ఇతరాలు: భారతీయ మత్స్యకారులు సముద్రం నుంచి తెచ్చే చేపలు, మద్యం తయారీకి వాడే స్క్రాప్ ధరలు తగ్గనున్నాయి.
భారం పెరగనున్నవి (ఖరీదు/ఖర్చు):
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్: షేర్ల ఆప్షన్లు, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) 0.02% నుండి 0.05% కి పెరిగింది. ఇది ట్రేడర్లపై అదనపు భారమవుతుంది.
ఆదాయపు పన్ను జరిమానాలు: ఇన్కమ్ టాక్స్ వివరాలలో తప్పుడు సమాచారం ఇస్తే.. కట్టాల్సిన పన్నుతో సమానమైన (100%) పెనాల్టీ విధిస్తారు.
ఆస్తుల వెల్లడి: స్థిర, చరాస్తులను లెక్కల్లో చూపకపోతే భారీ జరిమానాలు తప్పవు.






