Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎప్పటికీ ‘ప్రొఫెషనల్’ కాలేడు..!
గత ఏడాది ఐపిఎల్(IPL 2026) నుంచి సంచలనంగా మారుతోన్న రాజస్థాన్ రాయల్స్(RR) ఆటగాడు వైభవ్ సూర్యవంశిపై ఆర్సిబి (RCB) వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ సంచలన కామెంట్స్ చేసాడు. గత ఏడాది కాలంగా ఆట తీరుతో సంచలనంగా మారిన ఈ 14 ఏళ్ళ బీహారీ ఆటగాడు.. ఈసారి తన ఆటతీరుతో కాకుండా, ఐస్ క్రీంతో ఫేమస్ అయ్యాడు. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ యూట్యూబ్(YouTube) ఛానెల్లో జరిగిన సంభాషణలో జితేష్ శర్మ వైభవ్ గురించి మాట్లాడుతూ.. వైభవ్ అద్భుతమైన నైపుణ్యం కలిగిన ఆటగాడు… అతడికి ప్రపంచ క్రికెట్‌ను శాసించే సత్తా ఉందన్నాడు.
కానీ, అతడు ప్రొఫెషనల్ కాదు.. ఇది నేను కచ్చితంగా చెప్పగలను… అందరూ అతడిని ప్రొఫెషనల్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అతడు ఎప్పటికీ అలా మారతాడని నేను అనుకోవడం లేదన్నాడు. కనీసం ఆన్-ఫీల్డ్‌లో కాకపోయినా, ఆఫ్-ఫీల్డ్‌లో కూడా ప్రొఫెషనల్‌గా ఉండడు అన్నాడు. వైభవ్ క్రమశిక్షణ లేకపోవడంపై జితేష్ ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు. తాను తన వంతు ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. రాత్రిపూట ఐస్ క్రీమ్ తినవద్దని అతడికి పదేపదే చెబుతున్నాని, కానీ అతడు అస్సలు వినడు అంటూ కామెంట్ చేసాడు.
ఇవి కూడా చదవండి
వైభవ్ గతంలో తన ఆహారపు అలవాట్ల వల్ల బరువు పెరిగాడని, అయితే ఇటీవలే జిమ్‌కు వెళ్లి బరువు తగ్గించుకున్నాడని సమాచారం. ఇక డివిలియర్స్ కామెంట్స్ చూస్తే.. జితేష్ వ్యాఖ్యలతో డివిలియర్స్ కొంత విభేదించాడు. వైభవ్ ఆన్-ఫీల్డ్‌లో చూపే పరిణతి తనను ఆశ్చర్యపరిచిందని, అతడు ఒక గొప్ప ఆటగాడని కొనియాడాడు. ఇక ఏది ఎలా ఉన్నా వచ్చే ఐపీఎల్ 2026 సీజన్ లో వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉన్నాయి. అండర్ 19 వరల్డ్ కప్ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు.
ఇవి కూడా చదవండి








