England: బీర్, వేప్, గోల్ఫ్.. ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ లో సంచలనాలు..!
ఇంగ్లాండ్ (England)క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum) నేతృత్వంలోని ‘బాజ్‌బాల్’ (Bazball) వ్యూహం ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతోంది. మైదానంలో దూకుడుగా ఆడటం పక్కన పెడితే, డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల క్రమశిక్షణ తప్పిందంటూ వచ్చిన ఒక నివేదిక క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో లేదా విరామ సమయంలో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో బీర్లు తాగడం, వేపింగ్ (Vaping) చేయడం వంటివి చేస్తున్నారని ఈసీబీకి అందిన నివేదికలో సంచలన విషయాలను ప్రస్తావించారు.
ప్రొఫెషనల్ క్రికెట్లో ఇలాంటి అలవాట్లు ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపుతాయని విమర్శకులు మండిపడుతున్నారు. ప్రాక్టీస్ సెషన్ల కంటే ఆటగాళ్లు గోల్ఫ్ ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. నెట్ ప్రాక్టీస్‌ను వదిలేసి గోల్ఫ్ కోర్సుల్లో గడపడం వల్ల ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటోందని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనివ్వాలనే మెక్కల్లమ్ సిద్ధాంతం ఇప్పుడు రివర్స్ అయినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ లేని స్వేచ్ఛ జట్టు ప్రదర్శనను దిగజార్చుతోందని ఈ నివేదిక సారాంశం.
ఇటీవల వరుస ఓటముల తర్వాత ఈ అంతర్గత విషయాలు బయటకు రావడం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB)ని ఇరకాటంలో పడేసింది. ముఖ్యంగా భారత్ లేదా ఆస్ట్రేలియా వంటి జట్లతో ఆడుతున్నప్పుడు ఇలాంటి ధోరణి పనికిరాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆటను ఎంజాయ్ చేయాలనే మెక్కల్లమ్ మంత్రం, ఆటగాళ్లను బాధ్యతారాహిత్యంగా మార్చిందా? అనే సందేహాలు ఈసీబీ పెద్దల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నివేదికపై స్పందించన మెక్కల్లమ్, తన పద్ధతిని సమర్థించుకుంటారా లేదా మార్పులు చేస్తారా అన్నది వేచి చూడాలి. అయితే అతనిని వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కెప్టెన్ బెన్ స్తోక్స్ తో ఉన్న విభేదాలు కూడా ఆటగాళ్ళలో కాన్ఫిడెన్స్ దెబ్బ తినడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








