Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు (Nallabalu)పై రాష్ట్ర హైకోర్టు (High Court) తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ను సుప్రీం న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు పోస్టులు పెట్టారని పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ కేసుపై గతంలో విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు, సదరు ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులపై మెకానికల్గా కేసులు నమోదు చేయొద్దని పోలీసులకు సూచించింది. ఈ మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా గతంలో ప్రస్తావించారు. ఈ కేసును తాజాగా విచారించిన సుప్రీం న్యాయస్థానం, హైకోర్టు తీర్పును అభినందిస్తున్నామని, మార్గదర్శకాలు ఇవ్వడంలో తప్పేమీలేదని స్పష్టం చేసింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






