Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసు.. విచారణ ముగించిన సుప్రీంకోర్టు
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై జస్టిస్ సంజయ్ కరోల్ నేతత్వంలోని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఈ కేసుకు సంబంధించి దాఖలైన మొత్తం 10 పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)తుది నిర్ణయం తీసుకున్నారని, ఇప్పటికే కోర్టుకు వివరించారు. 10 మంది ఎమ్మెల్యేలు (MLAs) పార్టీ మారలేదని కోర్టుకు తెలిపారు. సింఘ్వీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం విచారణ ముగిసినట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి








