KTR: ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు : కేటీఆర్
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి శాసనసభాపతి ప్రసాద్ కుమాక్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని బిఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకట రోజుగా అభివర్ణించారు. ఇది కేవలం ఒక తీర్పు కాదు, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి








