Tank Bund Siva: ట్యాంక్ బండ్ శివకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహయం
ట్యాంక్ బండ్ శివ (Tank Bund Siva)కు ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆర్థిక సాయం చేశారు. శివ కుటుంబానికి రూ.5 లక్షలతోపాటు అతడి కుమారుడు వేణుమాధవ్ కు హోంగార్డు (Home Guard) ఉద్యోగ నియామకపత్రాన్ని అందజేశారు. ట్యాంక్ బండ్ పై నుంచి ప్రమాదశాత్తు పడిన, ఆత్మహత్య చేసుకోవాలని దూకిన, ఎంతో మందిని శివ కాపాడారు. ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై శివ కుటుంబం ఇబ్బందులు పడుతుండగా, ఆ విషయం సీఎం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం తరఫున సాయం అందించాలని అప్పట్లో అధికారులను సీఎం ఆదేశించారు. తాజాగా శివకు ఆర్థిక సాయంతోపాటు అతడి కుమారుడికి హోంగార్డు ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం ఆందజేశారు. ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో తనకు ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని శివ కోరగా, చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇంటిని సైతం మంజూరు చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








