రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని నామినేషన్
జనసేన తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ (Lingamaneni Ramesh) నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వనితారాణి (Vanitarani)కి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra,), జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఎన్.ఈశ్వరరావు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నుంచి రమేష్ బీ ఫాం అందుకున్నారు. తర్వాత, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి శాసనసభకు చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు.








