జనసేన రాజ్యసభ అభ్యర్థి ఖరారు
జనసేన రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh) పేరు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థిత్వంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ (Hariprasad) వెల్లడించారు. లింగమనేని రమేశ్‌కు 2025 నుంచి జనసేనతో అనుబంధం ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే పవన్ ఆలోచనలకు ఆయన ఆకర్షితులయ్యారు. నేడు రమేశ్ నామినేషన్ వేస్తారు అని హరిప్రసాద్ పేర్కొన్నారు.








