విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్.. చంద్రబాబు కృషితో ఏపీలో టెక్ విప్లవం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఒక భారీ టెక్ అభివృద్ధి అధ్యాయం ప్రారంభమవుతోంది. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కృషి ఫలితంగా ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ (Google) రాష్ట్రంలో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ (AI Data Center) ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌తో విశాఖపట్నం (Visakhapatnam) అంతర్జాతీయ టెక్నాలజీ మ్యాప్‌లో శాశ్వత స్థానం పొందనుంది.
సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఈ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుండటం దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది. 1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మించనున్న ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సేవలు , డేటా స్టోరేజ్ రంగాల్లో పెద్ద మార్పులు రానున్నాయి.
తర్లువాడ (Tarluvada), అడవి వరం (Adavi Varam), రాంబిల్లి (Rambilli) ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో అదానీ కనెక్స్ (AdaniConneX), ఎయిర్టెల్ నెక్స్ట్రా (Airtel Nxtra) వంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలు మరింత బలపడనున్నాయి.
ఈ నెల 28న చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానాన్ని అమలు చేయడం వల్లే ఈ పెట్టుబడి సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న సబ్ సీ కేబుల్ (Subsea Cable) వ్యవస్థ ద్వారా విశాఖ నేరుగా అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుంది.
ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రానికి కేవలం టెక్ అభివృద్ధి మాత్రమే కాకుండా భారీ ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. ఏఐ ఇంజినీరింగ్, క్లౌడ్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ (Data Science) వంటి రంగాల్లో వేలాది మంది యువతకు ఉద్యోగాలు దొరకనున్నాయి. అలాగే అనుబంధ రంగాల్లో కూడా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, నెట్వర్కింగ్ , సర్వర్ తయారీ రంగాల్లో కొత్త పరిశ్రమలు రావచ్చని భావిస్తున్నారు.
ఈ డేటా సెంటర్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం చేకూరనుంది. విశాఖపట్నం అంతర్జాతీయ టెక్ హబ్‌గా మారే దిశగా ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి








