ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డును స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ – 2025 అవార్డును స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవార్డు స్వీకరించిన అనంతరం మాట్లాడిన సీఎం. టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు స్వీకరించడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు ద్వారా మరికొన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏపీలో అనుమతుల వేగాన్ని పారిశ్రామిక వేత్తలు గుర్తించాలని కోరుతున్నాను. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయి.

దేశంలో సంస్కరణలు అమలవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. ఇది పెట్టుబడులకు కూడా మెరుగైన సమయం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాల ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం. ఏఐ డాక్టర్, ఎఐ ట్యూటర్, ఏఐ అగ్రానమి లాంటి సేవలు అందిస్తున్నాం. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థాయి దేశంగా మారుతుంది. ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్.








