గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
* శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్ పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా
* కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ భరత్ తదితరులు


* శంకుస్థాపన కార్యక్రమానికి ముందు గూగుల్ ఎక్స్ పీరియన్స్ జోన్ ను పరిశీలించిన సీఎం.
* అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా భాగస్వామ్యంతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో క్లౌడ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న గూగుల్
* విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్న గూగుల్
* తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 600 ఎకరాల కేటాయించిన ప్రభుత్వం







