గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్ర ఐటీ రంగ చరిత్రను మార్చేలా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్ (Google AI Data Hub)కు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తో కలిసి సీఎం చంద్రబాబు (Chandrababu), మంత్రి లోకేశ్ (Lokesh) శంకుస్థాపన చేశారు. గూగుల్ డేటా సెంటర్ రాక విశాఖ ముఖ చిత్రాన్ని మార్చనుంది. ఏఐ డేటా హబ్‌గా, సబ్‌సీ కేబుల్ నెట్వర్క్కి కేంద్రంగా అవతరించబోతోంది. మొత్తం రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. 1 గిగావాట్‌కు పైగా సామర్థ్యంతో మÖడు చోట వీటిని ఏర్పాటు చేస్తోంది. 2028 నాటికి మÖడు డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. తొలి దశలో తర్లువాడలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 17.80 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. గూగుల్ ఏఐ హబ్‌తో 1.88 లక్షల ఉద్యోగావకాశాలు రానున్నాయి. నిరామణ దశలోనే 60 వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. నిర్ణా సమయంలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వర్క్ ఫోర్స్ అవసరం ఉంటుంది. గూగుల్ క్లౌడ్ పరంగా ఆసియాకే విశాఖ ఏఐ హబ్ గేట్వేగా మారనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి







