ఏపీ ప్రజలకు చంద్రబాబు బిగ్ గుడ్ న్యూస్..!
అమరావతిలో విద్యుత్ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కీలక అంశాన్ని ప్రస్తావించారు సిఎం చంద్రబాబు. రాష్ట్ర ఇంధన రంగాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా సాగిన ఈ సమావేశంలో.. ప్రధానంగా సామాన్య వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా, విద్యుత్ కొనుగోలు ఛార్జీలను యూనిట్ కు రూ.4.60కి పరిమితం చేసేలా పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూనే, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించింది సర్కార్. పర్యావరణ హితమైన ఇంధన వనరుల వాడకాన్ని పెంచే లక్ష్యంతో, రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన (Renewable Energy) ఉత్పత్తిని భారీగా పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ రంగంలో నిరంతర పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేక ఎనర్జీ వర్శిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది రాబోయే తరాలకు ఇంధన రంగంలో అవసరమైన నైపుణ్యాన్ని అందించడమే కాకుండా, రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలుష్య నివారణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ఇందుకు సంబంధించి ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్యఘర్ (PM Surya Ghar) ద్వారా ఇంటి పైకప్పులపై సోలార్ విద్యుత్, అలాగే పీఎం కుసుమ్ (PM Kusum) పథకం ద్వారా రైతులకు సోలార్ పంపుసెట్ల పంపిణీ వంటి లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా అటు సామాన్యులకు, ఇటు రైతులకు ఇంధన ఖర్చులు తగ్గి, ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
ఇవి కూడా చదవండి







