విద్యుత్ శాఖ అధికారుల పని తీరు అభినందనీయం : మంత్రి గొట్టిపాటి
రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) అన్నారు. గుణదల విద్యుత్ సౌధలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ అందరి కృషి కారణంగానే విద్యుత్ శాఖ (Electricity Department)కు మంచి పేరు వచ్చింది. ఛార్జీలు పెంచకూడదు. సరఫరాలో అంతరాయం ఉండొద్దని సీఎం ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. విపత్తుల సమయాల్లో విద్యుత్ శాఖ అధికారుల పని తీరు అభినందనీయం అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});







