Electricity Demand: రూ.6,000 కోట్లతో ఏపీలో నూతన విద్యుత్ మౌలిక సదుపాయాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో విద్యుత్ కొరత (Electricity Demand) లేకుండా చూడటం, నిరంతర విద్యుత్ సరఫరాను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ఏకంగా రూ.6,000 కోట్ల వ్యయంతో భారీ విద్యుత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాసనసభలో అధికారికంగా వివరాలను వెల్లడించారు.
200కు పైగా కొత్త సబ్స్టేషన్లు..
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం (Electricity Demand) అధికంగా ఉన్న (హై-లోడ్) ప్రాంతాలను గుర్తించి, అక్కడ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 200కి పైగా 33/11 కేవీ (kV) సామర్థ్యమున్న సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సామర్థ్యం గల భారీ సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లను సైతం వేగంగా నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
విద్యుత్ డిమాండ్‌కు కారణం?
రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన ఊపందుకోవడం వల్లే డిమాండ్ (Electricity Demand) పెరుగుతోందని మంత్రి రవికుమార్ సభలో వివరించారు. దీనికి తోడు వ్యవసాయ కనెక్షన్లు భారీగా ఇవ్వడం, అలాగే వాణిజ్య, గృహ అవసరాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ పరిణామాలతో రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం ప్రస్తుతం ఉన్న 263 మిలియన్ యూనిట్ల నుంచి త్వరలోనే 280 మిలియన్ యూనిట్లకు చేరుకోనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగానే మౌలిక వసతులు పెంచుతోంది.
విజయనగరం జిల్లా ప్రాజెక్టులు..
అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ వివిధ ప్రాజెక్టుల వివరాలను మంత్రి వెల్లడించారు. విజయనగరం జిల్లాలో రూ.46 కోట్ల వ్యయంతో చేపట్టిన 220 కేవీ, 132 కేవీ లైన్ల పనులు (Electricity Demand) ఇప్పటికే పూర్తయి, ఛార్జింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. రూ.77 కోట్లతో చేపట్టిన వేణుగోపాలపురం సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రస్తుతం రీ-టెండరింగ్ దశలో ఉన్నాయని, 2027 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక పట్టణాల్లో అండర్‌గ్రౌండ్ (భూగర్భ) విద్యుత్ కేబులింగ్ వ్యవస్థ ఏర్పాటు అత్యంత ఖర్చుతో కూడుకున్నదని, నిధుల లభ్యత ఆధారంగానే దానిపై ముందుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి







