Rammohan Naidu: వారందరికీ ఈ విజయం అంకితం : రామ్మోహన్ నాయుడు
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడం ఆనందంగా ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అన్నారు. రాజధాని కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరి శ్రమకు ఫలితం లభించిందని, వారందరికీ ఈ విజయం అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. రాజధాని విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ అవమానాలకు ముగింపు పలుకుతూ బలమైన భవిష్యత్తుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తోందన్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా వైసీపీ ఎంపీలు వాకౌట్ చేయడం, వారి విధ్వంస వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తు ఉంటే, అమరావతి (Amaravati)ని ఓ స్కామ్ గా జగన్ (Jagan) పేర్కొనడం ఆయన అజ్ఞానాన్ని , రైతులపై ఉన్న అసూయను చాటుతోంది. ఎవరెన్ని ఆరోపణలు చేసినా నిజాలు తెలిసిన ప్రజలు, కూటమితో కలిసి అభివృద్ధి వైపు నడవడానికే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కషి చేస్తున్న ప్రధాని మోదీ (Modi), హోం మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లకు ధన్యవాదాలు అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








