Minister Lokesh: అమరావతి విజయం .. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష: మంత్రి లోకేశ్
అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్( Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నా రాజధాని అమరావతి (Amaravati) అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చరిత్రాత్మక రోజుకు పార్లమెంటు వేదిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ (Assembly) ఇటీవల ఏకగ్రీవ తీర్మానం చేసింది. తాజాగా అమరావతికి చట్టబద్ధత బిల్లును పార్లమెంటు (Parliament)లో ప్రవేశపెట్టి, ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భంగా. కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష. ఇది అమరావతి విజయం. ఏపీ ప్రజల విజయం. రైతుల త్యాగాలకు లభించిన దైవ ఆశీస్సులు శాంతియుత పోరాట ఫలితం అని లోకేశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








