Sasikala-Ramdoss: తమిళనాడులో మరో కూటమి..?
తమిళనాడు రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి.ఇప్పటివరకూ ఓ వైపు డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి.. మరోవైపు ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ బరిలోకి దిగుతున్నాయి. ఇక ఇదయ దళపతి విజయ్ రాజకీయ ఆగమనం.. ఓ విధంగా ఇరు కూటములకు ఆందోళన కలిగిస్తోంది. అయితే విజయ్ ను తమ కూటమిలోకి చేర్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో బీజేపీని బలంగా వ్యతిరేకించిన విజయ్.. ఇప్పుడా పార్టీ ఆధ్వర్యంలోని కూటమిలో చేరతారా అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది.
ఇలాంటి తరుణంలో మరో కూటమి పుట్టుకొచ్చింది.ఇద్దరు సీనియర్ నేతలు, పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్. రామదాస్, జయలలిత నెచ్చెలి వీకే శశికళ అనూహ్యంగా చేతులు కలిపారు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కొత్త కూటమి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
విల్లుపురం జిల్లా తైలాపురంలోని రామదాస్ నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ తమ కూటమి తరఫున అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేశారు. తమ కూటమిలోకి మరిన్ని చిన్న పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు రామదాస్ తెలిపారు.
మరోవైపు.. ఈ కొత్త కూటమి అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే ఓటు బ్యాంకులకు గండి కొట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాము అధిక స్థానాల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తామంటున్నారు కూటమి నేతలు..
ఇవి కూడా చదవండి








