TRUMP: ఇరాన్ లో అంతర్యుద్ధానికి అమెరికా ప్లాన్..!
ఇరాన్ పై పోరులో అమెరికా ద్విముఖ వ్యూహాన్ని అమలుచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు బహిరంగంగా ఇరాన్ పై యుద్ధం చేస్తోంది. ఇజ్రాయెల్ సాయంతో యుద్ధక్షేత్రంలో బాంబింగ్ చేస్తోంది. అయితే మరోవైపు.. అంతర్గతంగా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగాఇరాన్ లో ప్రజా తిరుగుబాటును ప్రోత్సహించేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తోందని సమాచారం.
ఇరాన్లో ప్రజా తిరుగుబాటును ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా.. ఇరాన్-ఇరాక్ సరిహద్దుల్లో చురుగ్గా ఉన్న కుర్దులకు(KURDISH) ఆయుధాలు ఇవ్వాలని ప్లాన్ చేస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఇరాన్ విపక్ష గ్రూపులు, కుర్దిష్ లీడర్లతో ట్రంప్ అధికారులు చర్చలు జరుపుతున్నారని వెల్లడించాయి.

దీనిలో భాగంగా డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇరానియన్ కుర్దిస్థాన్ (KDPI) అధ్యక్షుడితో ట్రంప్ మాట్లాడారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ ఇరాన్లో రానున్న రోజుల్లో జరిగే గ్రౌండ్ ఆపరేషన్‌లో ఇరానియన్ కుర్దిష్ బలగాలు పాల్గొనాలని చూస్తున్నాయి. దాన్ని ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాయి. అలాగే ఇజ్రాయెల్, అమెరికా మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాయి.
ఇరాన్, ఇరాక్, సిరియా, తుర్కియేలో విస్తరించిన కుర్దుజాతి.. తమకు స్వతంత్ర దేశం కావాలని దశాబ్దాలుగా పోరాడుతుంది. ఇరాన్-ఇరాక్ సరిహద్దుల్లో ఇరానియన్ కుర్దిష్ సాయుధ గ్రూప్‌లకు వేల సంఖ్యలో బలగాలు ఉన్నాయి. ఇవి పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన వెంటనే ఇరాన్ సైనిక దళాలు వెనక్కి తగ్గాలంటూ ప్రకటనలు చేశాయి. మరోవైపు.. ఈ గ్రూపులపై ఇరాన్ సైన్యం దాడులు చేయడంతో పాటు కేడీపీఐను కూడా టార్గెట్ చేసింది.
ఇవి కూడా చదవండి








